సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (09:28 IST)

నీ మరదలు నీతో కాదు నాతో లవ్‌లో పడిపోయింది, నువ్విక సైడైపో... అంతే, బ్లేడ్ తీసుకుని...

నా మరదలితో లవ్‌లో పడ్డాను, ఆమె కూడా నన్ను ప్రేమించేట్లు సాయం చేయండిరా అంటూ స్నేహితులను రిక్వెస్ట్ చేసాడు ఫ్రెండ్. స్నేహితుడిచ్చిన భరోసాతో అతడి మరదలితో మాటలు కలిపాడు. కట్ చేస్తే అతడే ఆమెను పీకల్లోతు ప్రేమలో దింపేశాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడికి కూడా చెప్పేశాడు. ఆమె నిన్ను లవ్ చేయడంలేదు. నన్ను చేస్తోంది. కనుక నీ మరదలిని వదులుకుని నువ్వు సైడ్ అయిపో అన్నాడు. అంతే.. అతడు కాస్తా బ్లేడ్ తీసుకుని ఆగ్రహంతో బయలుదేరాడు.
 
వివరాలలోకి వెళితే... హైదరాబాదులోని జూబ్లిహిల్స్ పరిధిలోని రహ్మత్ నగర్‌కి చెందిన 19 ఏళ్ల సాయిచైతన్య 17 ఏళ్ల తన అక్క కుమార్తెను ప్రేమిస్తున్నాడు. కానీ ఆమె అతడిని ప్రేమిస్తుందో లేదో తెలియదు. దీనితో తన ప్రేమకు స్నేహితుల సహకారాన్ని ఆశించాడు. ఐతే వారిలో ఒకడు ఏకంగా స్నేహితుడి మరదలినే లవ్వులో దించేశాడు.
 
ఇదే విషయాన్ని తన స్నేహితుడు సాయిచైతన్యకు మెసేజ్ చేశాడు. నీ మరదలు నా ప్రేమలో పడింది. ఇక ఆమెను నువ్వు మర్చిపో అంటూ సందేశం పంపాడు. దీనితో ఆగ్రహంతో ఊగిపోయిన సాయి చైతన్య.. గ్రౌండులోకి రండి తేల్చుకుందాం అని అన్నాడు. అంతా గ్రౌండ్ వద్ద కలుసుకున్నారు. మాటా మాటా పెరిగింది.
 
సాయి చైతన్య తన వద్ద వున్న బ్లేడ్ తీసుకుని స్నేహితుడి మెడపై గాట్లు పెట్టాడు. అంతే.. అతడు కుప్పకూలి ఆర్తనాదాలు చేశాడు. స్థానికులు గమనించి అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సాయి చైతన్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.