మల్కాజిగిరిలో ప్రేమించి ప్రెగ్నెంట్ చేసిన లవ్ జిహాదీ....
రాఫీక్ అనే ముస్లిం యువకుడు ప్రేమ పేరుతో దళిత యువతిని మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు లోకి వచ్చింది. బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకుని గర్భవతిని చేసి మోసం చేసాడని యువతి వాపోతోంది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్లో సంఘటన జరిగింది.
క్రిష్ణవేణి అలియాస్ షబానా, రఫీక్ మల్కాజిగిరి మల్లికార్జున్ నగర్లో నివాసముండేవారు. రఫిక్ వరంగల్‌కి చేందినవాడు. 6 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని హైదరాబాద్‌కి వచ్చారు. అమ్మాయి హిందువు కావడంతో మతం మారితే కానీ పెళ్ళిచేసుకోనని రఫిక్ తెలపడంతో బలవంతం చేయడంతో తప్పని పరిస్థితుల్లో మతం మార్చుకుని షభానాగా మారింది.
కాపురం కొన్ని రోజులు బాగానే సాగింది కాని అసలైన కధ ఆ తర్వాతే మొదలైంది. పిల్లలు కావాలని బలవంతం చేయడం మొదలుపెట్టాడు రఫిక్, 4సార్లు అబార్షన్ అయింది, అప్పటి నుంచి భార్యని వేధించడం మొదలుపెట్టాడు, వైద్యం కోసం పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని కొట్టడం మొదలుపెట్టాడు.
పలుమార్లు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కౌన్సిలింగ్‌తో సరిపెట్టారు. ఆఖరికి ఇప్పుడు క్రిష్ణవేణి గర్భందాల్చి నాలుగవ నెల రాగానే నాకు సంబంధం లేదని వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుపై ఇలాంటి పనులకు దిగజారే వాడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.