గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (17:42 IST)

నా హృదయం నీ మందిరము

నా హృదయమె నీ మందిరము!
నీ సన్నిధియే సుందరము!!
నా భావము నీ స్పందనము!
నీకిదే దాసుని వందనము
 
నీకే అంకితము జీవనము!
నిన్నెంచుటచే పావనము!!
నీ ఆరాధన నా ధనము!
లక్ష్యసిద్ధి కదె సాధనము!!
 
అగాధమీ భవసాగరము!
కాదు ఈదగా, నా తరము!!
నా బుద్ధి సదా చంచలము!
నడిపించుట నీ కైవసము!!
 
నీ సంకేతమె నాదు మార్గము!
నీ సంగీతమె నాదు స్వర్గము!!
నా సంతోషము నీ వరదానము!
నాకానందము నీ దర్శనము!!!