సంబంధిత వార్తలు
- వైరల్ అవుతున్న రోబో భామ పిక్స్... ఇండియాలో అయితే నేరమే..(వీడియో)
- ప్రియుడితో కలిసి భర్తకు స్కెచ్ వేసిన భార్య... పూటుగా మద్యం సేవించి..
- ప్రియుడిపై మోజు.. భర్తకు సుగంధి సోడాలో మత్తు మందు కలిపి?
- నా భర్తను చంపకుంటే నువ్వు నావద్దకు వద్దు... ప్రియుడికి వార్నంగ్... ఏం జరిగింది?
- గర్భిణీ యువతిపై సామూహిక అత్యాచారం.. ప్రేమికుడి కళ్లముందే ఘోరం..
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన ఇలియానా... ఫోటోలు డిలీట్
గోవా బ్యూటీ, నాజూకు నడుం చిన్నదిగా గుర్తింపు పొందిన ఇలియానా తన ప్రియుడుతో బ్రేకప్ చెప్పింది. దీనికి నిదర్శనమే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. దీంతో ఆమె ప్రియుడితో విడిపోయారని తేటతెల్లమైంది.
నిజానికి ఇలియానా లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. ఇద్దరూ సోషల్‌మీడియా ఖాతాల్లో అన్యోన్యంగా దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. 'ఈ ఫొటో తీసింది మావారే' అంటూ క్రిస్మస్ ట్రీని అలంకరిస్తున్న ఫొటోను ఇలియానా గతంలో పోస్ట్ చేశారు.
ఆండ్రూ కూడా పలు సందర్భాల్లో ఇలియానా అందాన్ని మెచ్చుకుంటూ ఫొటోలు షేర్ చేశారు కూడా. దీంతో ఇలియానా అతడిని వివాహం చేసుకున్నారని వదంతులు వచ్చాయి. దీని గురించి నటిని ప్రశ్నించగా.. 'ఈ విషయంపై కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేమిద్దరం చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాం. ధన్యవాదాలు.. నా వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగానే ఉంచాలి అనుకుంటున్నా' అని అన్నారు.
ఇలియానా కోసం ఆండ్రూ పలుమార్లు ముంబైకి కూడా వచ్చారు. కాగా ఇప్పుడు వీరిద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది. ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్ హాట్ టాపిక్‌గా మారింది. కొన్నేళ్లపాటు సంతోషంగా ఉన్న వీరు విడిపోవడానికి కారణం ఏంటని కథనాలు రాస్తున్నారు. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే ఇలియానా స్పందించాల్సిందే.
