సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఫ్రీతి
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (19:02 IST)

వైరల్ అవుతున్న రోబో భామ పిక్స్... ఇండియాలో అయితే నేరమే..(వీడియో)

ఐ, రోబో సినిమాలతో తెలుగుతెరపై అందాలు ఆరబోసిన అమీ జాక్సన్ త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనాయోటుతో సహజీవనం చేస్తున్న ఈ భామ అందరికీ భిన్నంగా ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ప్రతి సంఘటనను, తన ఆనందాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. 
 
ఈ ఫోటోలు చూస్తే ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో చాలా సంతోషంగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసారు.
 
ఒక ఫోటోలో ఆమె స్విమ్మింగ్ పూల్ చుట్టూ నడుస్తూ కనిపించారు. ఆమె బేబీ బంప్ చూస్తుంటే తొమ్మిదో నెల జరుగుతున్నట్లు తెలుస్తోంది, ఇంకా ఓ వైపు త్వరలో తల్లిని కాబోతున్న ఆమెను మహారాణిలా చూసుకునే బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు ఆమె సంతోషం ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కొన్ని రోజుల క్రితం, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌‌ను పూర్తిగా చూపుతూ పెట్టిన టాప్‌లెస్ ఫోటో అమీ జాక్సన్ షేర్ చేసిన ఫోటోల్లో ఎక్కువగా వైరల్ అయ్యింది.
 
ఇక ఇండియాలో పుట్టబోయేది ఆడబిడ్డా? మగబిడ్డా? అనే విషయాన్ని డాక్టర్లు ముందుగా చెప్పడం లేదా వ్యక్తులు ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించడం నేరం. అయితే ఇంగ్లండ్‍‌లో అలాంటి ఆంక్షలు ఏమీ లేకపోవడం వలన తనకు పుట్టబోయేది మగబిడ్డే అని ఇటీవల జరిగిన ఓ పార్టీలో అమీ జాక్సన్ ప్రకటించారు. 
 
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుంది, కానీ ఎక్కడ జరుగుతుందో డిసైడ్ కాలేదు. అయితే మా పెళ్లికి భారతదేశం నుండి, అమెరికా నుంచి కూడా వస్తారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే చోట పెట్టాలని ఆలోచిస్తున్నాము" అని అమీ తెలిపారు.