గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : మంగళవారం, 28 మే 2019 (12:08 IST)

మెగాఫోన్ పట్టనున్న దర్శకేంద్రుడు...

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్‌కు తాజాగా రాజీనామా చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ పెడ్తూ... తానో కొత్త చిత్రాన్ని తీయనున్నట్టు ప్రకటించారు. 
 
ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని చెప్పిన ఆయన... "నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. 
 
ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో..." అని పేర్కొన్నారు. ముగ్గురు డైరెక్టర్స్‌తో ముగ్గురు హీరోయిన్స్‌తో ఈ సినిమా ఉండబోతున్నట్లు రాఘవేంద్రరావు ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చెప్తోంది.