సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 25 మే 2019 (15:17 IST)

ఆఖ‌రికి అఖిల్ సినిమా ప్రారంభం... ఈ సినిమా ప్ర‌త్యేక‌త ఏంటి..? ఇదైనా స‌క్స‌స్ ఇచ్చేనా..?

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రోడ‌క్ష‌న్ నెం 5గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మాత‌లు బ‌న్నీవాసు, వాసు వ‌ర్మలు నిర్మాత‌లుగా నిర్మాణం చేప‌డుతున్న చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు ఆదివారం ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్‌లో జరిగాయి. 
 
ఈ కార్య‌క్ర‌మానికి కింగ్ నాగార్జున, శ్రీమ‌తి అమ‌ల, మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి శ్రీమ‌తి సురేఖ, అల్లు అర‌వింద్ స‌తీమ‌ణి శ్రీమ‌తి నిర్మ‌ల, ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్, శ్రీకాంత్ అడ్డాల, మారుతి హ‌జ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో కింగ్ నాగార్జున గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా స్టైలిస్‌స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్‌ఆన్ చేయ‌గా అల్లు అర‌వింద్ మ‌న‌మరాలు బేబి అన్విత క్లాప్ కొట్టారు. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ఈ చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు జరిగాయి. 
 
ఇందులో అల్లు అర‌వింద్, కింగ్ నాగార్జున ఫ్యామిలీలు రావ‌టం యూనిట్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. 
 
అఖిల్ అక్కినేని -బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ల కాంబినేష‌న్ 
అక్కినేని నాగేశ్వ‌రావు, అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని త‌న‌ సినిమాల ద్వారా త‌న‌కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన "హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్నూ" వంటి ల‌వ్ కమ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్‌లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. 
 
"బొమ్మ‌రిల్లు" లాంటి చిత్రం ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ త‌ర్వాత వ‌చ్చిన "ప‌రుగు" చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలి ఆడియ‌న్స్‌లో భాస్క‌ర్ ది సెప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్ప‌డు వీర‌ద్దిరి కాంబినేష‌న్‌లో చిత్రం అన‌గానే ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది. 
 
100 పర్సెంట్ ల‌వ్ త‌ర్వాత అక్కినేని వార‌సుడు గీతా ఆర్ట్స్‌లో.. 
గ‌తంలో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100 పర్సెంట్ ల‌వ్‌.
 
ఈ చిత్రంలో అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మాత బ‌న్ని వాసు నిర్మాతగా నిర్మించాడు. ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని సాధించింది. మ‌ళ్లీ ఇప్పుడు అక్కినేని వారి మ‌రో న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'బొమ్మ‌రిల్లు, ప‌రుగు' లాంటి ట్రేండ్ సెట్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. ఈ చిత్రం కూడా 100 పర్సెంట్ ల‌వ్‌కి డ‌బుల్ హిట్‌ని సాధిస్తుంద‌రి యూనిట్‌లో కాన్ఫిడెన్స్ వుండ‌టం విశేషం. 
 
వీరి కాంబినేషన్‌లో వచ్చిన '100 పర్సెంట్ లవ్, నుండి పిల్లా నువ్వులేని జీవితం, గీతా గోవిందం' వ‌ర‌కూ వ‌ర‌స బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు సొంతం చేసుకున్నారు. సెలెక్టెడ్ స్క్రీప్ట్‌ల‌తో అప్‌డేటెడ్‌గా అల్లు అర‌వింద్ స‌ల‌హ‌లు సూచ‌న‌ల‌తో బ‌న్నీ వాసు యువ నిర్మాతగా స‌క్స్‌రేట్ ఎక్కువుగా వున్న నిర్మాతల్లో ఒక‌డిగా త‌న‌కంటూ  ప్రత్యేకతని ఏర్ప‌రుచుకున్నాడు. ఇప్ప‌డు ఈ చిత్ర క‌థ న‌చ్చిన మ‌రో యంగ్ ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ మెట్ట‌మెద‌టిసారిగా నిర్మాణ రంగంలోకి బ‌న్నీ వాసుతో క‌లిసి యంగ్ డైన‌మిక్ అఖిల్ అక్కినేని‌తో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.