బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (11:21 IST)

నా క్యారెక్టర్ జోలికి వస్తే సహించను... రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌లుగా కొనసాగుతున్నవారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ మరియు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా బాలీవుడ్‌లో ఆమె నటించిన దే దే ప్యార్ దే సినిమా విడుదలై రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. ఇక తమిళ హీరో సూర్యతో కలిసి నటించిన NGK చిత్రం మే 31న విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో రకుల్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 
 
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువైంది. ఇటీవల నేను కూడా రెండు, మూడు వివాదాలను ఎదుర్కొన్నాను. అందుకే ఇక నా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ఇబ్బంది అనిపించనంత వరకు నేను వాటిపై స్పందించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ నా క్యారెక్టర్‌ను కించపరిచేలా ట్రోల్స్ చేస్తే సహించను, వారికి తగిన బుద్ధి చెప్తానని పేర్కొన్నారు.
 
టాలీవుడ్ యువసామ్రాట్ నాగార్జునతో కలిసి మన్మథుడులో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం అత్యుత్సాహం అవుతుంది. కానీ ఈ పాత్ర నా కెరీర్‌లో అన్నింటి కంటే బెస్ట్ పాత్ర అవుతుందని మాత్రం చెప్పగలను. ఇక బాలీవుడ్‌లో నాకు దే దే ప్యార్ దే సినిమాతో మొదటి విజయం దక్కింది. ఈ సినిమాలో నా ఫెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. 
 
ఈ సినిమాలో నటించి గొప్ప అనుభూతి పొందానని వివరించారు. నేను సక్సెస్ వస్తే పొంగిపోను, అలాగే ఫెయిల్యూర్స్‌కు కుంగిపోను. సినిమా స్క్రిప్ట్ బాగుండి, బాగా ఆడుతుందనుకుంటేనే ఆ సినిమాను అంగీకరిస్తాను. ఆ సినిమా బాగా ఆడితే అది టీమ్ ఘనతగా భావిస్తాను. ఒకవేళ ఫెయిల్ అయితే తర్వాత ఏమి చేయాలనే దాని గురించి ఆలోచిస్తాను, అంతేగానీ చేతులు ముడుచుకొని కూర్చొనని పేర్కొన్నారు.