సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (14:23 IST)

ఎట్టకేలకు హీరోయిన్‌ను పట్టేసిన రాజమౌళి... (video)

దర్శకుడు రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల వ్యయంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లను నటించనున్నారు. వీరిలో ఒకరు అలియా భట్ కాగా, మరో హీరోయిన్‌గా డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేస్తున్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా డైసీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 
 
ఆమె వ్యక్తిగత కారణాలతో సినిమా నుంచి తప్పుకోగా, మరో హీరోయిన్‌ను వెతికే పనిలో పడిన రాజమౌళి, ఇప్పుడు అమెరికన్ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఎమ్మాకు ఇదే తొలి భారతీయ చిత్రం. ఈమె జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించనుంది. అలాగే, చెర్రీ తరపున అలియా భట్ నటించనుంది.