శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (13:02 IST)

ఇద్దరు కుమారుల ఫోటోను పోస్ట్ చేసిన ఎన్టీఆర్.. లవకుశలని కామెంట్స్

జక్కన్న రాజమౌళి తాజా సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. సమయం దొరికినప్పుడల్లా.. ఇంట్లో భార్య పిల్లలతో గడుపుతున్నాడు. గత ఏడాది ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి రెండో కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చిన్నకుమారుడు భార్గవ రామ్‌కి ఏడాది నిండింది. శుక్రవారం తొలి పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్, తన ఇద్దరు కొడుకుల ఫోటోలు ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆ విషయాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అభయ్ రామ్,భార్గవ్ రామ్‌ల ఫోటోని చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ లవకుశులు వలే ఉన్నారని తెగమురిసిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.