గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (15:04 IST)

కొడాలి నానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం నేను కాదు.. నాకింకా 28 ఏళ్లే.. జూనియర్ ఎన్టీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంపై ఆ పార్టీ నుంచి వైకాపాలో చేరిన కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టకపోతే.. టీడీపీ పార్టీ కనుమరుగవుతుందన్నారు. ఇకనైనా నందమూరి కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 
 
అంతేగాకుండా తాను గుడివాడ నుంచి మరోమారు ఎన్నికయ్యానంటే వైకాపా చీఫ్ జగన్ కు‌ఉన్న ప్రజాదరణ కారణం అని అన్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో టీడీపీ తుడిపెట్టుకుపోవడమేనని చెప్పారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు భజన చేసేవాళ్లు... కష్టాల్లో ఉన్న టీడీపీని ఎన్టీఆర్ నుంచి తీసుకుని చంద్రబాబు విజయవంతంగా నడిపిస్తున్నారని చెప్తుంటారన్నారు. 
 
ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో టిడిపి అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. కానీ బాబు హయాంలో అంతటి భారీ విజయం టిడిపికి ఎప్పుడూ నమోదు కాలేదు. 2014లో కూడా కేవలం స్వల్ప తేడాతో టిడిపి గట్టెక్కింది. కావున బాబు వల్ల టిడిపికి ఒరిగింది ఏమీ లేదన్నారు.
 
ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో టీడీపీ పరిస్థితి డిజాస్టర్ అని నాని అభివర్ణించారు. భవిష్యత్తులో వైసీపీకి బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన స్నేహితుడే. అతడితో రాజకీయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ హీరోగా ఎన్టీఆర్‌కు మంచి భవిష్యత్తు వుంది. 
 
జూ. ఎన్టీఆర్ నా స్నేహితుడే. అతడితో రాజకీయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ హీరోగా ఎన్టీఆర్‌కు ఇంకా భవిష్యత్తు ఉంది. ఎన్టీఆర్ ఇప్పుడే రాజకీయాలు గురించి ఆలోచిస్తాడని అనుకోనని చెప్పారు. కానీ  వీలైనంత త్వరగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు టిడిపి పగ్గాలు చెప్పట్టాలి. లేకుంటే ఆ పార్టీ భవిష్యత్తులో ఉండదని నాని అన్నారు.
 
ఇకపోతే నాని వ్యాఖ్యలపై ఇంకా కొడాలి నాని వెనుక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి వ్యతిరేకంగా స్క్రీన్ ప్లే చేస్తున్నాడని వస్తున్న వార్తలపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. నాని వెనక నుండి తానే స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించట్లేదని చెప్పుకొచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే వయస్సు కాదని.. నాని తనకు సన్నిహతుడన్న మాట నిజమే. కానీ అతని వెనుక తానున్నానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు చెప్పారు. నాని పార్టీని వీడటం అతని వ్యక్తిగతమని తెలిపారు. 
 
టీడీపీ నుంచి వైకాపాకు జంప్ అయ్యేందుకు తాను స్క్రీన్ ప్లే, దర్శకత్వం తానేనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తనకు 28 సంవత్సరాలే అవుతున్నాయని.. సినిమాల్లో రాణించేందుకు దృష్టి పెట్టానని, కుటుంబ బాధ్యతలున్నాయని ప్రస్తుతానికి తాను రాజకీయాల్లోకి రానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. 
 
కానీ తన ప్రాణం వున్నంతవరకు, తెలుగు జాతి వున్నంతవరకు, తెలుగు దేశం వున్నంతవరకు ఆ పార్టీకే మద్దతిస్తానని తేల్చి చెప్పేశారు. పార్టీకి ఎప్పుడు తన అవసరం కావాల్సి వచ్చినా తాను తీరుస్తానని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో తనకు పదవులపై ఆశ లేదని వెల్లడించారు. ఇంకా నందమూరి కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు.