సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (12:06 IST)

ఐసీయూలో వెంటిలేటర్ పైన వున్నా వదలరా? బాలింత పట్ల వార్డ్ బాయ్..

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మహిళ పట్ల వార్డు బాయ్ లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన హైదరాబాదులో ని మొహిదీపట్నంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ ప్రసవం కోసం గత నెల 24న బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోని సెంచురీ ఆసుపత్రిలో చేరింది. 26వ తేదీన ఆమె పాపకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వార్డుబాయ్‌గా పనిచేస్తున్న గుడిమల్కాపూర్‌కు చెందిన అచ్యుతరావు (50) ఒంటరిగా ఉన్న బాలింత పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. 
 
శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో వెంటిలేటర్‌ తొలగించారు. దీంతో జరిగిన విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో  ఐపిసి సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అచ్యుతరావును అరెస్టు చేశారు.