శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శనివారం, 31 ఆగస్టు 2019 (21:48 IST)

తెదేపా కార్యకర్తలను ఊళ్ల నుంచి తరిమేస్తున్నారు... నేను వెంటబెట్టుకుని వస్తా: బాబు

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు వైకాపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్లో ఆయన ఇలా పేర్కొన్నారు. '' వైకాపా నేతలు తెదేపా కార్యకర్తల ఇళ్ళపై  దాడులు చేస్తున్నారు, భూములు సాగు చేసుకోనివ్వడం లేదు. గ్రామాలను ఖాళీచేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు. ఏంటీ దౌర్జన్యం? మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం. పౌరులందరికీ నివసించే హక్కుంది. ప్రజలందరికీ భావవ్యక్తీకరణ స్వేఛ్చ ఉంది.
 
ఈ హక్కులన్నిటినీ కాలరాస్తారా? అధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేస్తారా?  వైసీపీ వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది. మంగళవారం నుంచి గుంటూరులో వైసీపీ బాధితుల పునరాశ్రయ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం.
 
పల్నాడుతో సహా ఇతర ప్రాంతాలలో వైసీపీ కారణంగా నివాసం కోల్పోయిన బాధితులందరికీ, గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు గుంటూరు శిబిరంలో ఆశ్రయం కల్పిస్తాం. తర్వాత నేనే దగ్గరుండి బాధితులను ఆయా గ్రామాలకు వెంటబెట్టుకు వెళ్తాను. బాధితులందరికీ న్యాయపరంగా రక్షణ కల్పిస్తాం.''