మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2019 (14:41 IST)

ఆంధ్రా బ్యాంకును విలీనం చేస్తే.. ఆ పని చేయండి.. ఎంపీ బాలశౌరి

తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా వుందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. ఆంధ్రా బ్యాంకును- యూనియన్ బ్యాంకులో విలీనంపై ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బౌలశౌరి లేఖ రాశారు.
 
స్వాతంత్ర్యం రాక మునుపు నుండి 90 ఏళ్ల కిందటే ఏపి కి చెందిన పట్టాభిరామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంకును వేరే బ్యాంకులతో కలపొద్దని విన్నపం చేశారు. తెలుగు ప్రజల మనోభావాలను అద్దం పట్టే ఈ సునిశితమైన అంశంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పునరాలోచించుకోవాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఒక వేళ తప్పనిసరి పరిస్థితులలో విలీనం చేయాల్సి వస్తే విలీనమైన బ్యాంకుకు *ఆంధ్రా బ్యాంకుగానే నామకరణం చేయాలని ప్రతిపాదించారు. ఆంధ్రాబ్యాంకుగా మార్చి దాని హెడ్ క్వార్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు బ్యాంకింగ్ సెక్రటరీను ఎంపీ బాలశౌరి కలవనున్నారు.