పదో తరగతి పాసయ్యారా? తెలుగు సబ్జెక్ట్ చదివారా?

Last Updated: సోమవారం, 12 ఆగస్టు 2019 (19:33 IST)
పదో తరగతి పాసైయ్యారా? తెలుగు సబ్జెక్ట్ చదివారా? తెలుగుతో పాటు ఆంగ్లం చదవడం రాయడం తెలుసా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలున్నాయి. 


సబ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆంధ్రా బ్యాంక్. శ్రీకాకుళం జోన్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎస్‌టీ కేటగిరీలో సబ్‌స్టాఫ్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆంధ్రా బ్యాంక్ ప్రకటించింది. మొత్తం 15 ఖాళీలున్నాయి. వయోపరిమితి -18 నుంచి 25 లోపు వుండాలి. 
 
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
ది జోనల్ మేనేజర్, ఆంధ్రా బ్యాంక్, 
హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్, జోనల్ ఆఫీస్ శ్రీకాకుళం, 
వెంకటపురం జంక్షన్, నియర్ సింహద్వారం, 
శ్రీకాకుళం - 532005.దీనిపై మరింత చదవండి :