సంబంధిత వార్తలు
- ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ ఆహ్వానం : వారంలో బలం నిరూపించుకోవాలి...
- న్యాయ, పాలనా వ్యవస్థలు పౌరులకు రక్షణ కవచాలు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్
- ఎన్సీపీ ఎమ్మెల్యేలకు శరద్ పవార్ హెచ్చరిక... మాకు 170 మంది సభ్యుల బలం
- మంచి భవిష్యత్తుకు బాటలు వేసేలా బాల్యం: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
- వీడని 'మహా ఉత్కంఠత : రాష్ట్రపతి పాలన తప్పదా? కొన్ని గంటల్లో ముగియనున్న డెడ్‌లైన్
దిశ ఘటనపై గవర్నర్‌కి 'మా' కమిటీ విన్నపం
హైదరాబాద్‌లో దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. పశు వైద్యురాలు హత్యోదంతంపై పలువురు సినీ తారలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక ఆ ఘటనకు కారకులైన దోషులకు మరణ దండన విధించాలని డిమాండ్ చేశారు.
దిశ హత్యచారం లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, దిశకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదని, ఈ కేసుపై వేగంగా దర్యాప్తు జరిపి తొందరగా దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్రతినిధులు కలిశారు.
`మా` జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్.. ఉపాధ్యక్షురాలు హేమ.. అనిత చౌదరి.. జయలక్ష్మి తనీష్, సురేష్ కొండేటి.. ఏడిద శ్రీరామ్.. రవి ప్రకాష్ తదితరులు గవర్నర్‌కి విన్నవించారు.
