సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (17:02 IST)

రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు ఇవే...

దేశంలోని టెలికా కంపెనీలు సుధీర్ఘ విరామం తర్వాత మొబైల్ చార్జీలను పెంచాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి కంపెనీలు పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో కూడా టారిఫ్‌లను పెంచి పలు నూతన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్లు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
కొత్తగా ఆలిన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో సదరు ప్లాన్లలో జియో ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకునేందుకుగాను ఉచిత ఆఫ్-నెట్ మినట్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం ఆ నిమిషాలు అయిపోతే జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నారు. 
 
ఈ ప్లాన్ల వివరాలను పరిశీలిస్తే, 
28 రోజుల వాలిడిటీ ప్లాన్లు
* రూ.199 - రోజుకు 1.5 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు
* రూ.249 - రోజుకు 2 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు
* రూ.349 - రోజుకు 3 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు
 
56 రోజుల వాలిడిటీ ప్లాన్లు
* రూ.399 - రోజుకు 1.5 జీబీ డేటా, 2000 ఆఫ్-నెట్ నిమిషాలు
* రూ.444 - రోజుకు 2 జీబీ డేటా, 2000 ఆఫ్-నెట్ నిమిషాలు
 
84 రోజుల వాలిడిటీ ప్లాన్లు
* రూ.555 - రోజుకు 1.5 జీబీ డేటా, 3000 ఆఫ్-నెట్ నిమిషాలు
* రూ.599 - రోజుకు 2 జీబీ డేటా, 3000 ఆఫ్-నెట్ నిమిషాలు
 
365 రోజుల వాలిడిటీ ప్లాన్
* రూ.2199 - రోజుకు 1.5 జీబీ డేటా, 12,000 ఆఫ్-నెట్ నిమిషాలు
 
ఇతర ప్లాన్లు
* రూ.129 - 2 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు, 28 రోజుల వాలిడిటీ
* రూ.329 - 6 జీబీ డేటా, 3000 ఆఫ్-నెట్ నిమిషాలు, 84 రోజుల వాలిడిటీ
* రూ.1299 - 24 జీబీ డేటా, 12,000 ఆఫ్-నెట్ నిమిషాలు, 365 రోజుల వాలిడిటీ