శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (19:26 IST)

అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించిన జియో...

దేశంలో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ కంపెనీ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తాజా అదిరిపోయే ప్లాన్‌ను ప్రకటించింది. రూ.1776కి ఆ ప్లాన్ వినియోగదారులకు ప్రస్తుతం లభిస్తోంది. 
 
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఇప్పటికే తన ప్రీపెయిడ్ చార్జిలను పెంచగా, డిసెంబర్ 6వ తేదీన జియో ఆ చార్జిలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే అంతకు ముందుగానే జియో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టడం విశేషం. 
 
ఇక రూ.1776 ప్లాన్‌లో కస్టమర్లకు రూ.444 విలువైన 4 రీచార్జి ప్లాన్లు వస్తాయి. వాటిల్లో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 84 రోజుల వాలిడిటీ సౌకర్యాలు ఉంటాయి. 
 
అయితే ఆ నాలుగు ప్లాన్లను ఒకేసారి కలిపి రూ.1776కు రీచార్జి చేసుకుంటే ఏకంగా 336 రోజుల వాలిడిటీని, ప్లాన్లను, వాటి ఉపయోగాలను, ఒకేసారి పొందవచ్చని జియో తెలిపింది. ఈ క్రమంలో రూ.444 ప్లాన్ ఒకటి పూర్తి కాగానే మరొకటి ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. అలా ఏడాదిలో ఆ 4 ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు.