సంబంధిత వార్తలు
- ప్రిన్స్ మహేష్ మేనల్లుడు మూవీ ప్రారంభం.. క్లాప్ కొట్టిన చెర్రీ
- చైనాలో 5జీ నెట్వర్క్ ప్రారంభం, ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు
- అలా చేస్తే నరకానికి వెళ్లరు... పవన్ కళ్యాణ్ : నెలంతా ఘనాహారం బంద్.. (video)
- ఫేస్బుక్లో న్యూ ఫీచర్.. ఇప్పటికి అక్కడ మాత్రమే..
- సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రారంభమైన "ఆటో రజని" చిత్రం
పీఎస్‌ఎల్వీ సీ-47కు కౌంట్‌డౌన్ స్టార్ట్
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ కేంద్రంలో పీఎస్‌ఎల్వీ-సీ47 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పీఎస్‌ఎల్వీ-సీ47 ప్రయోగానికి ఉదయం 7.28 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. కౌంట్‌డౌన్ ప్రక్రియ 26 గంటల పాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 14 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ47 వాహకనౌక మోసుకెళ్లనుంది.
కార్టొశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. కార్టొశాట్3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టొశాట్-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టొశాట్-3 జీవితకాలం ఐదేళ్లపాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది.
