సంబంధిత వార్తలు
- 16 నెలల్లో రూ.1.26 లక్షల కోట్లు అప్పులతో జగన్ రికార్డ్: యనమల రామకృష్ణుడు
- ఆ అవసరం వచ్చినప్పుడల్లా సుశాంత్ నన్ను వాడుకున్నాడు: రియా చక్రవర్తి సన్సేషన్
- అత్తారింటికి దారేది దొరికింది, నేడు అమరావతి దారేది అంటూ పవన్ వస్తున్నారు: ఆర్ఆర్ఆర్
- ఇంకా ఎన్ని ప్రాణాలు బలైపోవాలి చెప్పండి? కేసీఆర్ పైన విజయశాంతి పైర్
- సీఎం జగన్‌తో నాది వన్‌సైడ్ లవ్... నేను ప్రేమిస్తూనే వుంటా.. ఆర్ఆర్ఆర్
రైతుల గుండెల్లో బీజేపి రెండు బాంబులు: మంత్రి హరీష్ రావు విమర్శల వర్షం
బీజేపీపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శల వర్షం కురిపించారు. ఇవాళ సిద్దిపేట జిల్లా రాయప్రోలు మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్ట పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రైతుబంధు పథకం లేదన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతుల గుండెల్లో రెండు బాంబులు వేసిందని పేర్కొన్నారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మొక్కలు కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేశారని, ఎవరి ప్రయోజనం కోసం చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ పార్టీని ప్రశ్నించారు. అలాగే బావుల వద్ద, బోర్ల వద్ద మీటర్లు పెట్టి కరెంటు బిల్లులు వసూళ్లు చేయాలని రైతులకు అన్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని విమర్శించారు.
వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసి కార్పోరేటీకరణకు తెరలేపి నయా జమిందారీ వ్యవస్థను తెస్తోందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రైతుల కోసమే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎప్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆర్డీవో విజయేందర్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.