శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 23 సెప్టెంబరు 2020 (19:39 IST)

ఆ అవసరం వచ్చినప్పుడల్లా సుశాంత్ నన్ను వాడుకున్నాడు: రియా చక్రవర్తి సన్సేషన్

సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ వాడకం బయటకు రావడంతో రియా చక్రవర్తి జైలులో పడింది. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తేలడంతో ఆమెతో పాటు ఆమె సోదరుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనకు బెయిల్ కావాలంటూ రియా కోర్టును అభ్యర్థిస్తోంది.
 
తన బెయిల్ పిటీషన్లో చనిపోయిన సుశాంత్ పైన ఆరోపణలు చేసింది. సుశాంతే తనను అవసరమొచ్చినప్పుడల్లా వాడుకున్నాడనీ, అతడు కేదార్ నాథ్ అనే సినిమా చేసేటపుడు గంజాయికి అలవాటుపడ్డాడని పేర్కొంది. అప్పటి నుంచి తనకు డ్రగ్స్ అవసరం వచ్చినప్పుడల్లా తమను వాడుకునేవాడనీ, తన పేరు బయటకు రాకుండా తమతో డ్రగ్స్ కొనిపించేవాడని ఆరోపించింది. తాము డ్రగ్స్ సుశాంత్ కోసం కొనుగోలు చేసాము తప్పించి తాము ఏనాడూ డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది. 
 
అసలు డ్రగ్స్ వాడిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడితే దాన్ని కొన్నవాళ్లకు 20 ఏళ్ల జైలు శిక్ష చట్టంలోని లొసుగులను ఎత్తిచూపుతోందంటూ తన బెయిల్ పిటీషన్లో రియా పేర్కొంది. కాగా సుశాంత్ పైన ఆమె ఆరోపణలు చేయడంపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.