1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Minister Satyavathi Rathod tests Corona positive

తెలంగాణలో మహిళా మంత్రికి కరోనా పాజిటివ్

Minister Satyavathi Rathod
తెలంగాణా రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 3 లక్షలను దాటేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గిరిజన అభివృద్ధి శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా సోకింది. 
 
ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆమె హోమ్ ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయారు. కాసేపటి క్రితం హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో ఆమె చేరినట్టు తెలుస్తోంది. మరోవైపు, తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
 
ఇదిలావుంటే, తెలంగాణలో కొత్తగా 111 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 27 కేసులను నిర్ధారించారు. గత 24 గంటల్లో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 1,642 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఇంటి ఎదురుగా బిజినెస్‌మేన్, రమ్మనగానే వచ్చేసాడు, ఆ తర్వాత నగ్న ఫోటోలతో...