1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. minister vemula prashanth reddy sensational comments on ap cm jagan

ఏపీ సీఎంపై తెలంగాణ మంత్రి ఫైర్.. నిధులు లేక భిక్షమెత్తుకుంటున్నారు..

minister
ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ నిధులు లేక కేంద్రాన్ని అడుక్కు తింటున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
గతంలో తెలంగాణ ఏర్పడితే అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు బిక్షం ఎత్తుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద‌ప్ర‌భుత్వం రైతుల‌ను చేస్తున్న మోసాల‌కు బీజేపీ నేత‌ల‌ను అడుగ‌డుగునా అడ్డుకోవాల‌ని పిలుపునిచ్చారు. 
 
ఏపీ నడవాలంటే కేంద్రం నిధులు కావాలన్న ప్రశాంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని విమర్శించారు. దేశం మొత్తం రైతులు మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌నే ప్ర‌ధాని మోడీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
భారీ వర్షాలతో ప్రభుత్వం అలర్ట్... బుగ్గవంక వాసులు భ‌య‌ప‌డొద్దు