గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 12 నవంబరు 2021 (11:20 IST)

నెల్లూరును టూరిజం హ‌బ్ గా మార్చాల‌న్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం అయ్యారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధిపై కేంద్ర మంత్రికి మంత్రి మేకపాటి ప్రతిపాదనలను సమర్పించారు.  
 
 
సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరించారు. సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని వినతిపత్రం స‌మ‌ర్పించారు. 

 
ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యాటక ప్రదేశాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి మంత్రి మేకపాటి తెలిపారు. నెల్లూరు జిల్లాకు చారిత్రాత్మ‌క ప్రాధాన్యం ఉంద‌ని, ఇక్క‌డ సంప్ర‌దాయబ‌ద్ధంగా జ‌రిగే స్థానిక పండుగల‌కు అశేషంగా పర్యాట‌కులు వ‌స్తుంటార‌ని అన్నారు. స్థానిక రొట్టెల పండ‌గకు, ఇత‌ర ఉత్స‌వాల‌కు అసంఖ్యాకంగా భ‌క్తులు వ‌స్తార‌ని వివ‌రించారు. నెల్లూరును టూరిజం ప‌రంగా హ‌బ్ గా మార్చాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి త‌న ఆకాంక్ష‌ను తెలిపారు.