1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. MLA Seethawka in Adivasi Gothikoyagoodem

ఆదివాసి గొత్తికోయగూడెంలో ఎమ్మెల్యే సీతక్క

MLA Seethawka
ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ గ్రామంలోని కోయగూడెం ఆదివాసి గొత్తికోయ గూడెంకు చెందిన 35 నిరుపేద కుటుంబాలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ని త్యావసర సరుకులను పంపిణీ చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో గొత్తికోయగూడాలలో పేద ప్రజలు తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారని వారి ఆకలి తీర్చడంతో కోసం ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.

అంతేకాకుండా దాతలు శ్రీకాంత్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డి, పద్మ సహాకారంతో ఈ రోజు నిత్యావసర సరుకులు బియ్యం, నూనె, పప్పు అందించారని వారి సహకారం గొత్తికోయలు ఎప్పుడు మర్చిపోరని అన్నారు.

సామాజిక దూరాన్ని పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మావురపు తిరుపతిరెడ్డి, సుధాకర్ రావు, ప్రభాకర్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
హైదరాబాదులో భారీగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..ఎందుకో తెలుసా?