కరోనా టెస్టులు : ప్రైవేటు ఆస్పత్రుల పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు

telangana covid
ఠాగూర్| Last Updated: బుధవారం, 20 మే 2020 (18:08 IST)
కరోనా టెస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కేవలం గాంధీ, నిమ్స్‌లోనే కాకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు చేయించుకునేందుకు అనేక మంది రోగులు వెనుకంజ వేస్తున్నారు. పైగా, కేవలం గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని అనుకోవడం భావ్యం కాదన్నారు.

అంతేకాకుండా, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లపై నమ్మకం లేకపోతే... ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు... ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది.

ఆస్పత్రులు, ల్యాబ్‌లలో వైద్య సిబ్బంది, సదుపాయాలను... ఐసీఎంఆర్‌ పరిశీలించి నోటిఫై చేయాలని తెలిపింది. ఐసీఎంఆర్‌ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే... కరోనా చికిత్సకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.దీనిపై మరింత చదవండి :