కరోనా కష్టాలు మరో యువ ఉపాధ్యాయుడి ప్రాణాలు తీశాయి. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ ప్రకటించారు. ఇపుడు అన్‌లాక్ 5.0 కొనసాగుతోంది. అయినప్పటికీ పాఠశాలలు తెరుచుకోలేదు. లాక్డౌన్ కారణంగా ఉద్యోగం పోయింది. తమ పొలంలో వేసిన పత్తి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా జాలుబారిపోయింది. దీంతో ఆర్థిక కష్టాలు వైపు, మరోవైపు, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆ ఉపాధ్యాయుడు పత్తి చేనులోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు....