శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (11:33 IST)

ఉచ్చు బిగుస్తోంది ఎవరికి..? టార్గెట్ కేసీఆర్ కుటుంబం..!

ఉచ్చు బిగుస్తోంది ఎవరికి..? 
టార్గెట్ కేసీఆర్ కుటుంబం..!
సన్నిహితులే లక్ష్యం
ఆ 3వేల కోట్లకు లెక్కలు ఎలా..?
తదుపరి ఆ ముగ్గురు ఎవరు..?
 
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోందా..? అంటే అవుననే జవాబు లభిస్తోంది. ఇటీవలే జరిగిన, జరుగుతున్న, జరగనున్న దాడులే ఓ ఉదాహరణ. ప్రముఖ వ్యాపార వేత్త, ధార్మిక వేత్త, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితుడు, అలాగే మెఘా కృష్ణారెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులపై దాడులు జరిగాయి. 
 
ఇలా ఒకవైపు నుంచి కేసీఆర్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే వారిపై ఈ దాడులు జరగటం ఎవరికి లాభం..? ఎంత వరకు లాభం..? ఏది ఎలా ఉన్నా మొత్తం మీద కేసీఆర్ కుటుంబం కనీపించని 'టార్గెట్'లో ఉందనేదో వాస్తవం. ఈ మొత్తం వ్యవహారంపై 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తున్న సంచలన పరిశోధన కథనం.
 
వీరిపైనే ఎందుకు...?: 
ప్రముఖ వ్యాపార వేత్త, ధార్మిక వేత్త, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితులలో ప్రథముడు. అలాగే ప్రముఖ స్వామిజి చిన్నజియ్యర్‌కు అత్యంత నమ్మకమైన భక్తుడు, మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు.

ఈయన పైనే ఊహించని రీతిలో ఆదాయపన్ను శాఖ తొలుత దాడులు చేసింది. అలాగే రామేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఐదు కీలక ప్రాంతాల్లో ఐటీ సోదాలు రెండు రోజులు జరిగాయి. 
 
ఇలహదే పద్దతిలో మెఘా కృష్ణారెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులపై కూడా ఐటి శాఖ దాడులు చేసింది.
 
చిన్న 'లింక్'.. ఎంత పని చేసింది..:
మై హోమ్ గ్రూప్ బెంగళూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల్లో బయటపడిన ఒక 'చిన్న లింక్' ఆధారంగా మై హోమ్ గ్రూప్ పైన ఈ దాడులు జరిగాయి. అనంతరం మెఘా సంస్థలతో పాటు కూకట్ పల్లి ఎమ్మెల్యే తనయుడికి చెందిన 'వెంకట ప్రణీత్ డెవలపర్స్' అనే సంస్థ ఉంది. ఆయనే ఆ కంపెనీకీ మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థ, ఆ సంస్థలోని మరో ఐదుగురి సభ్యులపై కూడా ఈ దాడులు జరిగాయి. 
 
 
ఎన్నికల 'లింక్'లో భారీగా నిధులు..:
మై హోమ్, మెఘా, వెంకట్ ప్రణీత్ డెవలపర్స్ పై ఆదాయపన్ను శాఖ చేసిన దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎన్నికల్లో కొన్ని పార్టీలకు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలను పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది.  అలాగే టీవీ9 కొనుగోళ్లు విషయంలో హావాలా నిధులు ఉపయోగించినట్లుగా ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
 
ఎందుకు జరుగుతున్నాయి..:
ఈ దాడులు రాజకీయంగా కొనసాగుతున్నాయా? లేక ఐటి అధికారులుకు దొరికిన 'లింక్' ఆధారంగా దాడులు జరుగుతున్నాయా..? అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీకి ఎంతో కావాల్సిన వ్యక్తులు ఈ ముగ్గురు. ఆ పార్టీకి వారు ఆర్ధికంగా వెన్ను దన్నుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
 
భాజపా బౌన్సర్..:
రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో తెరాసను దెబ్బ తీసేందుకు బీజేపీ వ్యూహంలో భాగంగా జరిగిందా..? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదీగాక tv9 వివాదంలో మాజీ సీఈఓ రవి ప్రకాష్ కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమితాషాతో మాట్లాడిన తర్వాత ఈ దాడుల పరంపర సాగటం మరో కోణం.
 
'ఆడిట్' డిఫరెంట్:
పైన పేర్కొన్న సంస్థలకు సంబంధించిన ఆడిట్ లావాదేవీలకు, ఆదాయపన్ను శాఖ వారి లెక్కలకు పొంతన కుదలటం లేదు. దీంతో ఐటీ అధికారులు బాగా కసరత్తులు చేసిన అనంతరం ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
 
నెక్స్ట్ ఆ ముగ్గురు ఎవరు..?:
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉండే పారిశ్రామిక వేత్తలు సుమారుగా 24మంది వరకు ఉన్నారు. వీరు కాకుండా ఇతరత్రా విద్య, వైద్యం, సంబంధిత వ్యాపారాలతో కోట్లు గడించిన మరో 18మంది ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
ముగింపు:
రాజకీయ నేతలు బినామీలపై కూడా ఐటిశాఖ దృష్టి పెట్టింది. భూ వ్యాపారంపై లావాదేవీలు చేసే ఆరుగురు ఉద్యోగుల వివరాలను ఏసీబీ నుంచి ఐటిశాఖ తీసుకున్నట్లు తెలిసింది.