బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (14:21 IST)

కేసీఆర్ హఠావో... తెలంగాణా బచావో : వీహచ్ పిలుపు

దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణలో పేదప్రజల కోసం కేసీఆర్ హఠావో, తెలంగాణకు బచావో నినాదంతో పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు పిలుపునిచ్చారు. 
 
ఆయన మంగళవారం హైదరాబాద్, గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలపై నమ్మకం లేకుండా పోయింది. 45 రోజులు విచారణ జరిపి ఇప్పుడు లేబర్ కోర్టుకు పొమ్మనడం వల్ల ప్రజలకు న్యాయంపైన విశ్వసం పోతుందన్నారు. డ్రైవర్ నగేష్ నా చావుకు ప్రభుత్వాన్ని కారణంగా కేసీఆర్‌ను చూపించారు. కోర్ట్ ఎందుకు సుమోటో కేసు ఎందుకు  నమోదు చేయడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. 
 
ఇందిరా గాంధీ అమలు చేసిన భూ సంస్కరణలు తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. రెవెన్యూలో అక్రమాలు పెరిగిపోయాయనీ, ఇవన్నింటిపైన పోరాటానికి కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో ముందుకు పోవాలని, దీనికి సంబంధించిన ప్రణాళికను ఈ నెల 30వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు.