1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Oneside lover stabbed girl with knife on road

షీ టీమ్స్‌కి చెప్పిందని కసి... యువతిని నడిరోడ్డుపై నరికిన ప్రేమోన్మాది...

Oneside lover
మహిళలపై దాడుల పరంపర సాగుతూనే ఉంది. ఓ కాలేజీ విద్యార్థినిపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో నడిరోడ్డులో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ప్రేమోన్మాదిగా మారిన ఒక యువకుడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది.
 
వివరాలలోకి వెళ్తే, కాచిగూడ పరిధిలోని సత్యనగర్‌లో ఉంటున్న మధులిక స్థానికంగా ప్రైవేటు కాలేజీలో చదువుకుంటోంది. ఎదురింట్లో ఉండే భరత్ ప్రేమించాల్సిందిగా ఆమె వెంటపడేవాడు. మధులిక అతని గురించి తల్లిడండ్రులకు చెప్పగా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసారు. తర్వాత వారు కౌన్సెలింగ్ ఇచ్చిన కూడా అతనిలో మార్పు రాలేదు. తనపై ఫిర్యాదు చేసారన్న అక్కసుతో మరింత రెచ్చిపోయాడు.
 
ఈ రోజు ఉదయం కాలేజీకి వెళ్తున్న మధులికను ఫాలో అయ్యి, తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసాడు. దాడిలో ఆమెకు మెడపై తీవ్రంగా గాయమై రక్తస్రావమైంది, నాలుగు వేళ్లు కూడా తెగిపోయాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
About Writer
ప్రీతి చిచ్చిలి
తర్వాతి కథనం
ఎయిర్ ఇండియా ఇడ్లీ, సాంబార్‌లో బొద్దింక.. షాకైన ప్రయాణీకుడు..