మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:55 IST)

నేను అందరిలాంటివాడిని కాదన్నాడు... లొంగిపోయింది... ఆ తర్వాత...

ఫేస్‌బుక్‌లో బాలికను పరిచయం చేసుకున్నాడు, ప్రేమిస్తున్నానని చెప్పాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఈ సంఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. 
 
గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం, మెట్టుగూడకు చెందిన బాలిక (17)తో అదే ప్రాంతానికి చెందిన సాయికిరణ్ (22) అనే వ్యక్తికి ఫేస్‌బుక్‌లో 2016లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది, చాటింగ్‌ల ద్వారా సంభాషించుకునేవారు. కొన్నాళ్ల తర్వాత నేరుగా కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. 
 
ఇటీవల ఆ బాలిక పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ముఖం చాటేశాడు. ఈ నెల 4వ తేదీన పెళ్లి విషయంగా అతడిని నిలదీయడంతో సమాధానం చెప్పకపోగా కులం పేరుతో దుషించాడు. మనస్తాపానికి గురైన బాలిక తల్లితో మొరపెట్టుకుంది. ఇద్దరూ కలిసి చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌, పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.