1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. police searching for Raviprakash, He tried for Bail

గాలిస్తున్న పోలీసులు... ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాష్ పాట్లు

police
టీవీ 9 యాజమాన్య బదలాయింపు, ఫోర్జరీలకు సంబంధించిన కేసుల విషయంలో ఇప్పటికే రవిప్రకాష్ కోసం ఒకవైపు సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. రవిప్రకాష్ ఇంటికి సైతం నోటీసులు అంటించారు. అయితే తాజాగా తన అరెస్టును అడ్డుకోవడానికి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు రవిప్రకాష్.
 
తనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసులపై ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ  పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. మరి బుధవారం హైకోర్టు రవిప్రకాష్‌కు ముందస్తు బెయిల్ కోసం ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి. న్యాయనిపుణుల మాత్రం రవిప్రకాష్ అరెస్టు తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు.
తర్వాతి కథనం
పిడుగుపాటుకు బలైన పేద రైతు కుటుంబం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి