1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. raghuveera reddy tied up to pillar

రఘువీరాను స్తంభానికి కట్టేసింది ఎవరు..?

raghuveera reddy
raghuveera
వాస్తవానికి గత కొంతకాలంగా రఘువీరా తన మనవరాలితో ఎంతో సరదాగా గడుపుతున్నారు. మనవరాలితో కలిసి సైక్లింగ్‌లో పోటీ పడుతూ.. ఆమె మొక్కలకు నీళ్లు పడుతుంటే సూచనలు ఇస్తూ.. ఆవులను నీటితో కడుగుతుంటే.. మురిసిపోతూ వీడియోలను ఆయన షేర్ చేస్తున్నారు. దసరా పర్వదినం రోజున తన మనవరాలితో కలిసి ఎద్దుల బండిపై వెళ్లిన వీడియోను సైతం రఘువీరా తన అభిమానులతో పంచుకున్నారు.
 
ఇక ఇప్పుడు తనను తాడుతో స్తంభానికి కట్టేసిన పిక్ షేర్ చేసి వార్తల్లో నిలిచారు ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 
కుమార్తె, కుమారులకు తన వ్యాపారాలను అప్పగించేసి పూర్తిగా పల్లె గాలిని పీల్చుకుంటున్నారు. అయితే రాజకీయాలకు దూరమైనప్పటికీ.. రఘువీరా ఇతర కార్యక్రమాల కోసం తన సమయం వెచ్చిస్తున్నారు. దీంతో తనతో ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు ఆయన్ను తాడుతో స్తంభానికి కట్టేసింది. ఈ ఫొటోను రఘువీరా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తనను తన మనవరాలే ఇలా కట్టేసిందని, ఇంట్లో నుంచి వెళ్లకుండా తనతో ఆడుకోవాలని చెప్పిందని రఘువీరారెడ్డి తెలిపారు.
About Writer
సెల్వి