1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Rainbow-like Sun Halo in Hyderabad mesmerises netizens

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం : చూడ్డానికి గుమికూడిన జనం

Rainbow
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పట్టపగలు సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు (రంగుల వలయం) ఏర్పడింది. సుమారు గంట పాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. 
 
ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి నగరంలో పలుచోట్ల జనం గుమిగూడారు. తమ మొబైల్ ఫోన్లలో బంధించి మురిసిపోయారు. నగరంతో పాటు తాండూరు తదితర ప్రాంతాల్లోనూ వలయాకార దృశ్యాలు కంటపడ్డాయి.
 
గత నెలలో ఇలాంటి దృశ్యం బెంగళూరులో కూడా దర్శనమిచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీన్ని సన్‌హాలో అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచికగా భావిస్తారు. 
 
ఇదిలావుంటే, సూర్యుడు చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుభమంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
సైంటిఫిక్ పరిభాషలో వీటిని '22-డిగ్రీ హలోస్' అని పిలుస్తారని తెలిపారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కరోనా బాధితులకు వరుసబెడుతున్న రోగాలు... కొత్తగా పేగుల్లో గ్యాంగ్రీన్