శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (14:58 IST)

ప్రియురాలికి ప్రాణాంతక వ్యాధి... కెటామైన విషపు సూదివేసి...

ముంబై మహానగరంలో ఓ దారుణం వెలుగు చూసింది. తన ప్రియురాలికి ప్రాణాంతక వ్యాధి ఉందని తెలుసుకున్న ప్రియుడు... ఆమెను పెళ్ళి చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు కదా, విషపు ఇంజెక్షన్ ద్వారా హత్య చేశాడు. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై పన్వెల్ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు ఇటీవల గుర్తించారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
పన్వెల్‌లోని ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న చంద్రకాంత్ గైకర్ అనే వ్యక్తికి తన సోదరితో ఎఫైర్ ఉందని మృతురాలి సోదరుడు పోలీసులకు చెప్పాడు. దీంతో చంద్రకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం వెల్లడించాడు. 
 
తన ప్రియురాలి ప్రాణాంత వ్యాధితో బాధపడుతుందని, అందువల్ల ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే భయంతో తాను అనారోగ్యానికి గురైన ప్రియురాలికి ఇంజక్షన్ ఇచ్చి చంపానని చంద్రకాంత్ అంగీకరించాడు. 
 
ప్రియురాలి అనారోగ్యం తగ్గించేందుకు ఇంజక్షన్ అని చెప్పి, కెటమైన్ ఇంజక్షన్ చేశాడని తేలింది. దీంతో నిందితుడైన చంద్రకాంత్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.