సంబంధిత వార్తలు
- ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌కు మాతృ వియోగం: పంతులమ్మగా వేలాదిమందికి విద్యాబుధ్దులు నేర్పిన రంగనాయకమ్మ
- ఆన్లైన్లో చిన్నపిల్లల వీడియోలు.. సీబీఐ సోదాలు
- ఐశ్వర్య రాయ్ మరోసారి తల్లి కాబోతుందా?
- మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ కిట్స్ పంపిణీ
- పాఠశాల విద్యార్థులకు 30,107 జతల షూస్‌ను విరాళంగా అందించిన రియల్ పేజ్ ఇండియా
తల్లి శవం ముందు ఐదేళ్ల చిన్నారి... కేటీఆర్‌కు ట్యాగ్.. రంగంలోకి కలెక్టర్
Child
గ్రామానికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి తల్లి మంగళవారం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటికే తండ్రి కూడా మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో తల్లి శవం ముందు దీనంగా కూర్చున్న చిన్నారి ఫొటోను ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ ఫొటోను గంటెపాక శ్రీకాంత్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ''ప్రభుత్వం ఈ ఐదేళ్ల చిన్నారి బాధ్యతలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని'' మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు.
ఆ ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీకి ట్యాగ్ చేసి చిన్నారి బాగోగులు చూడాలని ట్వీట్ చేశారు. దీంతో కలెక్టర్ సహా, జిల్లా యంత్రాంగం ఎడ్‌బిడ్ గ్రామానికి వెళ్లి చిన్నారిని కలిసి పరామర్శించారు.
Child
వెంటనే శిశు సంక్షేమ శాఖ అధికారులు చిన్నారిని దత్తత తీసుకున్నట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ప్రకటించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చిన గంటెపాక శ్రీకాంత్‌ను ఆ జిల్లా ప్రజలు, నెటిజన్లు అభినందిస్తున్నారు.