శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (14:05 IST)

ఆన్‌లైన్‌లో చిన్నపిల్లల వీడియోలు.. సీబీఐ సోదాలు

ఆన్‌లైన్‌లో చిన్నపిల్లల ఫోన్ వీడియోలకు సంబంధించి ఇండియా వ్యాప్తంగా సీబీఐ ఒక్కసారిగా దాడులు నిర్వహించింది. ఇటీవల 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసిన సీబీఐ అధికారులు తాజాగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారుల పోర్న్ వీడియోలకు సంబంధించి సోదాలు నిర్వహించింది.

14 రాష్ట్రాల్లోని ఏకంగా 76 ప్రాంతాల్లో సిబిఐ దాడులు చేస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులను చేస్తోంది సీబీఐ. ఆంధ్రప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో సిబిఐ సోదాలు చేస్తోంది. దేశ‌వ్యాప్తంగా 76 ప్రాంతాల్లో, 14 రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్న సీబీఐ అధికారులు.. ఇప్ప‌టికే 23 కేసులు న‌మోదు చేశారు.