సంబంధిత వార్తలు
- 13 నుంచి తెలంగాణాలో పాఠశాలలు ప్రారంభం : సబితా ఇంద్రారెడ్డి
- ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద మృతి
- సీఎం కేసీఆర్‌కు దీదీ ఫోన్.. ఎందుకో తెలుసా?
- కేసీఆర్ జాతీయ పార్టీ.. అదే కారు బొమ్మ..? భారత్ రాష్ట్రీయ సమితి పేరిట?
- 2022 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల ద్వారా వచ్చిన వార్షిక మొత్తం రూ.123,727 మిలియన్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోగిన బడిగంట...
తెలంగాణ రాష్ట్రంలో బడిగంట మోగింది. సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాల తలుపులు తెరుచుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థుల చదువులు అస్తవ్యస్తంగా మారిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను సోమవారం నుంచి పాఠశాలలు తెరిచారు.
నిన్నటి వరకు వేసవి సెలవుల ఒడిలో సేదతీరిన చిన్నారులు చదువుల తల్లి ఒడిలోకి చేరుతున్నారు. అందుకు తగినట్టుగానే ఆయా పాఠశాలలో యజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముఖ్యంగా, కరోనా జాగ్రత్తలు పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకున్నాయి.
విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. తరగతి గదుల శానిటైజేషన్‌ను విధిగా చేశారు. స్కూల్లో ఒక విద్యార్థికి పాజిటివ్ అని తేలితే ఆ విద్యార్థి చుట్టుపక్కల కూర్చున్న విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పాఠశాలల ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచారు.
తరగతి గదులు, బెంచీలు, కిటికీలు, టాయిలెట్లు, నల్లాలు, హ్యాండ్‌వాష్ సింక్‌లు, తాగునీటి ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు ఇలా ప్రతి ఒక్కదాన్ని శుభ్రం చేయించారు. ట్యాంకుల్లో పేరుకుపోయిన చెత్త, నిల్వ నీటిని తొలగించారు. పాఠశాల ప్రాంగణాలను కూడా శానిటైజ్ చేశారు.
కాగా, హైదరాబాద్ జిల్లాలో 2821, రంగారెడ్డి జిల్లాలో 2682, మేడ్చల్ జిల్లాలో 1948 పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి.
తర్వాతి కథనం
