1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Serial chain snatcher keeps Hyderabad cops on their toes

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌: నిందితుడు అరెస్ట్

Serial chain snatcher
హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మహానగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజస్తాన్‌కు చెందిన ఉమేష్ ఖతిక్ అని పోలీసులు ఫొటోను విడుదల చేశారు. ఈ నెల 19న ఒక్క రోజే హైదరాబాద్‌లో పలు చోట్ల స్నాచింగ్‌లతో ఉమేష్ కలకలం సృష్టించాడు.
 
మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ చోరీలకు పాల్పడ్డాడు. గుజరాత్, మహారాష్ట్రలో కూడా ఉమేష్ ఖతిక్‌పై చోరీ కేసులు ఉన్నాయి. ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చిన ఉమేష్.. ఆ మరుసటి రోజు చైన్న స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. అనంతరం అతడు వరంగల్ వెళ్లి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడిని పట్టుకునేందకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
పోలీసులు విచార‌ణలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ల‌ను ప‌రిశీలించారు. ఈ దొంగ‌త‌నాలకు నిందితుడు ఒకే బైక్‌ను ఉప‌యోగించిన‌ట్టు నిర్దారించుకున్నారు. అయితే ఆ బైక్‌ను నిందితుడు దొంగిలించినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
స‌ర్పంచి గిరి అంటే, రుబాబు కాదు.. రోడ్డు బాగు!