సంబంధిత వార్తలు
- దేశంలో కరోనా కేసుల అప్డేట్స్ ఇవే... తెలంగాణాలో శాంతించిన వైరస్
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త : దసరా సీజన్‌కు ముందునుంచే...
- తెలంగాణకు భారీ వర్ష సూచన, అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం
- తెలంగాణ రైతు పొలంలో భారీ వజ్రం, ధ్రువీకరించిన నిపుణులు: ప్రెస్ రివ్యూ
- తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్.. తెలంగాణలో 1,500 మార్కుకు చేరిన మృతుల సంఖ్య
తెలంగాణ ఎంసెట్-2020 కౌన్సిలింగ్‌లో స్వల్ప మార్పులు
ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 9నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ ప్రక్రియలను ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదలు కాగా, వెబ్ ఆప్షన్ ప్రక్రియ సోమవారం(ఈ నెల 12) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే ఇటు కాలేజీలకు యూనివరిసిటీ అప్లియేషన్స్ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని కోర్సులకు ఇంకా అనుమతి రాకపోవడంతో అధికారులు కౌన్సిలింగ్ తేదీల్లో స్వల్ప మార్పు చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే విధంగా అధికారులు మార్పు చేశారు.
18వ తేది మొదలు కానున్న వెబ్ ఆప్షన్లు 22వ తేదీ వరకు ఇచ్చేలా వీలు కల్పించారు. అభ్యర్థి ఎంచుకున్న ఆప్షన్లు ప్రీజ్ కావడంతో ఈ నెల 24న సీట్ల అలాట్మెంట్ పూర్తవుతుంది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 201 ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సులకు 1,10,873 సీట్లున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కోర్సులను, సీట్లను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. దీంతో వారంపాటు ఆప్షన్ల నమోదును వాయిదా వేశారు.