1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana govt release Guide Lines for Inter Second year Exam results

ఇంటర్ ఫస్టియర్ మార్కులే ఇంటర్ సెకండ్‌ ఇయర్‌కూ...

Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థలందరిన పాస్ చేసినట్టు ప్రకటించింది. కానీ, మార్కుల కేటాయింపులో ఓ మెలిక పెట్టింది. ఇంటర్ మొదటి సంవత్సవరంలో వచ్చిన మార్కులనే సెకండ్ ఇయర్‌లోనూ కేటాయిస్తామని తెలిపింది. 
 
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఫస్టియర్‌లో ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే సెకండియర్‌కూ కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.
 
ఫస్టియర్‌లో ఫెయిలైన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు సెకండియర్‌లో 35 శాతం మార్కులను కేటాయించనున్నట్టు పేర్కొంది. అలాగే, సెకండియర్ ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే, తాజా మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగైన తర్వాత కావాలనుకుంటే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భర్త వద్ద వధువు వింత కోరిక.. శోభనాన్ని షూట్ చేయాలి.. ఫోటోగ్రాఫర్స్‌ను కూడా..?