1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Minister Etala Rajender talk about CM KCR Change

సీఎ పదవి నుంచి కేసీఆర్‌ను తప్పించవచ్చు : మంత్రి ఈటల రాజేందర్!

Telangana
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తప్పించి, ఆ స్థానంలో ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఎన్నుకోవచ్చని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారతారని, సీఎం కేసీఆర్‌ స్థానంలో ఆయన తనయుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎం అవుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. 
 
ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చునని, ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చన్నారు. 'ఉంటే ఉండవచ్చు! తప్పకుండా! ఉంటే ఉంటదండీ!! తప్పేముంది?' అని వ్యాఖ్యానించారు. కరోనా టీకా ప్రారంభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరుకాకపోవడంపై రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదంటూ, 'మా దగ్గర 99 శాతం కార్యక్రమాలు మంత్రి కేటీఆర్‌ చూస్తారు' అని గుర్తుచేశారు. 
 
అలాగే, ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన కరోనా టీకాల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. సంబంధిత శాఖ మంత్రిగా నేను ఉన్నాను. సీఎం అందుబాటులో లేని అనేక సందర్భాల్లో ఆ పాత్రను కేటీఆర్‌ పోషిస్తున్నారు అని మంత్రి ఈటల చెప్పుకొచ్చారు. తనకు, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్‌నకు ఆస్కారమే లేదని, ఈ విషయంలో జరుగుతున్నదంతా ప్రచారమేనని కొట్టిపారేశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బాలికపై అత్యాచారం.. ఆపై గొంతుకోసి ప్రాణం తీసిన మృగాళ్లు.. ఎక్కడ?