శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (11:41 IST)

తెలంగాణలో కరోనా.. 24 గంటల్లో 206 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసులు 2,91,872కి చేరగా.. మరణాలు 1579కి పెరిగాయి. 
 
తాజాగా మరో 346 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 2,86,244గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,049 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరిలో 2,281 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.