1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus LIVE Updates: Telangana reports 299 new COVID-19 cases

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. 299 పాజిటివ్ కేసులు

Coronavirus LIVE Updates
తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 33,298 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం బులిటెన్ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,91,666కి చేరింది. 
 
కాగా శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,577కి చేరింది. కరోనా నుంచి నిన్న 379 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,85,898కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,191 ఉండగా..వీరిలో 2,395 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య మొత్తం 74,61,687కి చేరింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
13 ఏళ్ల అమ్మాయిపై దారుణం.. తొమ్మిది మంది.. మూడేసి సార్లు.. ట్రక్కు మార్చి..?