1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus found in China ice cream samples, thousands of boxes seized: Report

ఐస్‌క్రీమ్‌ల్లోనూ కరోనా ఆనవాళ్లు.. చైనాలో మళ్లీ కలకలం

Coronavirus
చైనా వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ అక్కడ తయారైన ఐస్‌క్రీమ్‌ల్లోనూ కరోనా ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆ బ్యాచ్లో ఉత్పత్తి అయిన వేల ఐస్క్రీం కార్టన్లను వెనక్కి తీసుకుంటోంది సంస్థ.
 
బీజింగ్‌కు సమీపాన ఉన్న తియాన్జిన్లోని డాకియావొడావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాచ్లో మొత్తం 29 వేల కార్టన్లు ఇంకా విక్రయించలేదని స్థానిక ప్రభుత్వాధికారులు తెలిపారు. 390 కార్టన్లు తియాన్జిన్లో అమ్మినట్లు వెల్లడించారు. వీటి అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయో కనిపెట్టే పనిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
 
అయితే ఐస్క్రీంల వల్ల ఎవరైనా కరోనా బారినపడ్డారో లేదో తెలియలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంస్థను సీజ్ చేసి, అందులోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, చైనాలో ఆదివారం 109 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో 72 కేసులు హెబే ప్రావిన్స్లోనే వెలుగుచూశాయి. ఇక్కడే చైనా ప్రభుత్వం భారీ ఐసోలేషన్ ఆస్పత్రిని నిర్మిస్తోంది. దేశంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. 299 పాజిటివ్ కేసులు