సంబంధిత వార్తలు
- బ్రెజిల్లో కొత్త రకం స్ట్రెయిన్.. వ్యాక్సిన్లు పనిచేయకపోవచ్చు..
- కరోనావైరస్ వ్యాక్సిన్: గురజాడ కవిత చదివిన ప్రధానమంత్రి మోదీ
- గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,590 కేసులు.. వ్యాక్సిన్‌పై జాగ్రత్తలు
- కరోనా మూలాలు కనుగొనేందుకు వెళ్లిన డబ్లూహెచ్‌వో నిపుణులకు క్వారంటైన్!
- #RedTheFilm రామ్ పోతినేని "రెడ్" మూవీ ఎలా వుంది (రివ్యూ)
24 గంటల్లో 15,144 కరోనా పాజిటివ్ కేసులు.. 181 మంది మృతి
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 15,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వైరస్ నుంచి మరో 17,170 మంది కోలుకున్నారని, మరో 181 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,57,985కు పెరిగింది.
ప్రస్తుతం 2,08,826 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,01,96,885 మంది కోలుకున్నారని.. 1,52,274 మంది మృత్యువాతపడ్డారని వివరించింది. ఇదిలా ఉంటే.. శనివారం 7,77,377 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చెప్పింది. ఇప్పటి వరకు 18.65కోట్లకుపైగా నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
మరోవైపు, గడిచిన 24 గంటల్లో 181 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,52,274కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,08,826కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది.
తర్వాతి కథనం
