తెలంగాణాలో ఓ పిల్ల.. ఆంధ్రాలో ఓ అమ్మాయి : వ్యక్తిపై ఫిర్యాదు

crime scene
ఠాగూర్| Last Updated: గురువారం, 14 జనవరి 2021 (22:05 IST)
తెలంగాణాలో ఓ పెళ్లిని... ఆంధ్రాకు వచ్చి మరో పెళ్లిని చేసుకున్న వ్యక్తిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బేల్దారి పని కోసం తెలంగాణాకు వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడు ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ళపాటు కాపురం చేశాడు. ఆ తర్వాత చెప్పాపెట్టకుండా ఆంధ్రకు వచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మోసం వెలుగులోకి రావడంతో బాధిత మహిళల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం బోయినపల్లి మండలం వర్ధపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వనజకు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తుమ్మల మహేష్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అనారోగ్యంతో భర్త మహేష్‌ చనిపోయాడు.

వెలిగండ్ల మండలం గండ్లోపల్లికి చెందిన జొన్నలగడ్డ నిరీక్షన్‌ బేల్దారి పని చేసుకునేందుకు వర్దపల్లి వెళ్లాడు. అక్కడ వనజతో పరిచయం ఏర్పడింది. వనజను వివాహం చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసి చెప్పాపెట్టకుండా ఏపీకి వచ్చి గండ్లోపల్లిలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడు.

ఈ విషయం తెలిసి ఆమె నిరీక్షన్‌కు ఫోన్‌ చేయగా తాను వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నానని, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని, ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించినట్లు ఫిర్యాదులో వనజ పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ముస్తఫా తెలిపారు.దీనిపై మరింత చదవండి :