శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (09:57 IST)

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల వివరాలు...

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 276 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 238 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,90,916 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం  2,84,849 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,572కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,495 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  2,487 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, ఏపీలో మంగళవారం కొత్తగా 203 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41 కేసులు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసుల వంతున నమోదయ్యాయి. ఇదేసమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు. గత 24 గంటల్లో 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
తాజా గణాంకాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,85,437కి చేరింది. ఇప్పటివరకు 8,75,921 మంది కోలుకోగా... 7,134 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,24,41,272 శాంపిల్స్‌ని పరీక్షించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులు ఉన్నాయి.