దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. వ్యాక్సిన్ పంపిణీలో రికార్డ్

corona virus
corona virus
సెల్వి| Last Updated: సోమవారం, 18 జనవరి 2021 (10:19 IST)
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,788 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. ఇందులో 2,08,012 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,02,11,342 మంది బాధితులు కోలుకున్నారు.

మరో 1,52,419 మంది మహమ్మారి వల్ల ప్రాణాలొదిరారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 14,457 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌ వల్ల మరో 145 మంది మృతిచెందారని వెల్లడించింది.

భారతదేశం ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోంది. వ్యాక్సిన్ పంపిణీలో అన్ని దేశాలకు మార్గదర్శనం చేస్తోంది. పకడ్బందీ ప్రణాళికతో అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ను విజయవంతంగా పంపిణీ చేసి భారత్ ఆదర్శంగా నిలిచింది.

తాజాగా కరోనా టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. తొలిరోజు అత్యధిక సంఖ్యలో టీకాను పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచంలోనే ఇంత పకడ్బందీగా ప్రణాళిక బద్దంగా ఎక్కడా జరగలేదని వివరించింది.దీనిపై మరింత చదవండి :