శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (18:13 IST)

డైపర్ నుంచి నాలుగేళ్లలోకి.. బౌండరీలను అదరగొడుతున్నాడు.. కేటీఆర్ ట్వీట్

cricket Boy
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారనే సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందించే కేటీఆర్.. ఫన్నీ వీడియోలు కూడా పోస్టు చేస్తూ వుంటారు. తాజాగా నాలుగేళ్ల బుడతడు ఆడిన క్రికెట్ వీడియోను నెట్టింట పోస్టు చేశాడు. నాలుగేళ్ల  వయసులోనే క్రికెట్‌ను ఓ ఆటాడేస్తున్నాడు. కొలకత్తాకు చెందిన ఆ చోటా క్రికెటర్ గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు.
 
వివరాల్లోకి వెళితే.. కొల్‌కత్తా లోని బెహాళ ప్రాంతం పరిధిలోని ముచిపరాలో షేక్ షాహిద్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఉన్నాడు. చిన్నపిల్లలతో కలిసి అతడు ఆటలాడతాడనుకుంటే పొరపాటే. ఎంచక్కా బ్యాట్ చేతపట్టుకుని బాల్‌ను బౌండరీలు దాటిస్తున్నాడు. స్టార్ క్రికెటర్లు అంతా ఆ బుడ్డోడు క్రికెట్ ఆడుతున్న తీరుకు ఫిదా అవుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వ్యగాన్ అయితే ఏకంగా ఆ బుడ్డోడిని కలిసి సెల్ఫీ కూడా దిగారు.
 
విరాట్ కొహ్లీ కూడా ఆ చోటా క్రికెటర్ వీడియోను షేర్ చేశారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ షాహిద్ వీడియో గురించి రియాక్టయ్యారు. 'డైపర్ నుంచి నాలుగేళ్ల వయసుకు వచ్చేశాడు. దేశానికి ఘన విజయం సాధించి పెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు' అంటూ షేక్ షాహిద్ ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
 
దీన్ని కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. దీంతో కేటీఆర్ ఆ వీడియోకు రియాక్షన్ ఇచ్చారు. 'అద్భుతమైన ప్రతిభాపాటవాలు కలిగిన ఈ బుడ్డోడి గురించి మీరేమంటారు వీవీఎస్ లక్ష్మణ్, హర్ష భోగ్లే..' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ వయసులోనే బాల్‌ను బౌండరీలు దాటిస్తున్న బుడ్డోడిని నెటిజన్లు పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. ఆ పిల్లాడి కళ్లు బాల్ మీదే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ వీవీఎస్ లక్ష్మణ్ అంటూ రియాక్షన్ ఇస్తున్నారు.